ఈతరం భారతం సెప్టెంబర్ 6 యాదాద్రి భువనగిరి : జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న అపర శ్రీరంగం శ్రీ లక్ష్మీ గోదా సమేత రంగనాయక స్వామి దేవాలయంలో భాద్రపద శుద్ధ చతుర్దశి సందర్భంగా శనివారం అనంత కోటి వత్తుల పూజను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మంగళగిరి శేషగిరి, వరదరాజుల ఆధ్వర్యంలో ఈ విశేష పూజా కార్యక్రమం జరిగింది. మహిళలు ఆలయ ధ్వజస్తంభ ప్రాంగణంలో అనంత కోటి వత్తులను వెలిగించి మొక్కులను సమర్పించారు. కార్యక్రమంలో సముద్రాల కుమార్, రాములమ్మ, సోమలక్ష్మి, బెలిదే శ్రీధర్, పడకంటి సందీప్, సుప్రియ, కాసం నాగయ్య, వీరలక్ష్మి, సముద్రాల ప్రభ,భక్తులు పాల్గొన్నారు.















