EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సద్దుల బతుకమ్మ వేడుకలకు హాజరైన ఐవిఎఫ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ వంగపల్లి అంజయ్య స్వామి

ఈతరం భారతం సెప్టెంబర్ 29 యాదాద్రి భువనగిరి: జిల్లా పరిధిలోని పలు గ్రామాలలో సోమవారం సాయంత్రం జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలలో ఐ వి ఎఫ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి పాల్గొన్నారు. మహిళలకు సద్దుల బతుకమ్మ వేడుక శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు. ప్రకృతి పూల ప్రాధాన్యతను తెలుపుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి మనిషి పాటుపడాలని దైవికంగా ఇచ్చే సందేశం బతుకమ్మ పండుగలో ఉందని ఆయన చెప్పారు. తొమ్మిది రోజుల నవరాత్రి బతుకమ్మ ఉత్సవాలకు సద్దుల బతుకమ్మ పరిసమాప్తి అని తెలిపారు. భక్తిశ్రద్ధలతో బతుకమ్మను నిర్వహించిన మహిళలకు ఐ వి ఎఫ్ తరఫున ఆయన ధన్యవాదాలు చెప్పారు.

Related News

Select the Topic
Scroll to Top