EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సమాజసేవే మోడీకి నిజమైన జన్మదిన కానుక  బిజెపి ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 14 (ఈతరం భారతం);: జాతీయ జెండా ఆవిష్కరణ, రక్తదాన శిబిరం నిర్వహణ,మొక్కలు నాటడం వంటి సామాజిక సేవ కార్యక్రమాలే ప్రధాని నరేంద్ర మోడీకి నిజమైన జన్మదిన కానుక అవుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శులు చందా మహేందర్ గుప్తా , కాదూరి అచ్చయ్య , మండల పార్టీ అధ్యక్షురాలు గుంటిపల్లి మహేశ్వరి సత్యనారాయణ అన్నారు . పట్టణంలో ఆదివారం సేవాపక్షం మండల కార్యశాల గోపగాని ప్రసాద్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథి చందా మహేందర్ గుప్తా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 వ జన్మదినం సందర్భంగా 15 రోజులపాటు చేయాల్సిన సేవా కార్యక్రమాలను వివరించారు .17వ తేదీన అన్ని గ్రామాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ , రక్తదాన శిబిరం నిర్వహణ, 18వ తేదీన స్వచ్ఛభారత్ తో పాటు అమ్మ పేరున గ్రామానికి 25 మొక్కలు నాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా 27వ తేదీ న దివ్యాంగులను సన్మానించాలని కోరారు . అక్టోబర్ రెండవ తేదీన మహాత్మా గాంధీతో పాటు లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహాలకు నివాళులు అర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గంధమల్ల మహేష్ గౌడ్, గుంటిపల్లి సత్యనారాయణ, కళ్ళెం శ్రీనివాస్ గౌడ్, దేవరకొండ నారాయణ,సుబ్బూరు వీరస్వామి, షారాజీ లక్ష్మయ్య, దొంత భరత్, కో కన్వీనర్లు బండి మహేష్, బండకింది సాయి,చింతల శ్యామ్, గుండె నర్సింహులు, కుమార్, కర్రె మహేందర్, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top