EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఓటు చోరీ చేస్తే..అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఎందుకు గెలవలేదు

ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 16:

_______________________________

రాహుల్ గాంధీ నిజంగానే పప్పు గాంధీ అనిబీజె వై ఎంరాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండె. ఎద్దేవా చేశారు.శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత పౌరుడు కాదు…ఇటలీ పౌరుడు అని అన్నారు

ఓటు చోరీ చేస్తే..అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు.

జ్ఞానేష్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ కాకముందు బీజేపీ గెలవలేదా ..? 12 ఏళ్ల నుండి అందరినీ ఏకతాటిపైకి తెచ్చిన వ్యక్తి మోడీ.. అలాంటి మోడీ పై కాంగ్రెస్ మాట్లాడుతుందాని విమర్శించారు. మీలాగా స్కాం లు అవినీతి దందాలు చేసే పార్టీ బీజేపీ కాదు..  గూట్లో రాయి తీయలేనివాడు ఏట్ల రాయి తీయడానికి పోయినట్టుంది.. రేవంత్ రెడ్డి డిల్లీ టూర్..

నిరుద్యోగ యువతను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ..

మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలు తీరుస్తాం అని సరూర్ నగర్ లో చెప్పారు గాంధీ కుటుంబం.. ప్రియాంక గాంధీ ఆమె ఇంట్లో నుండి తెచ్చినట్టే మాట్లాడారు..సీఎం మంత్రులు అందరూ పోయి దిల్లీలో ధర్నా చేయడానికి సిగ్గు ఉండాలని విమర్శించారు. రాహుల్ గాంధీ హైద్రాబాద్ వస్తె యువత చెప్పుల దండ వేస్తారు..  రాహుల్ గాంధీ దిల్లీలో ధర్నాలు కాదు ఇక్కడికి వచ్చి మాట్లాడు..తెలంగాణ లో ఉన్న మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించు…ద్వంద వైఖరి మానండి అని హితవు పలికారు.  ఎంఎల్సీ ఎన్నికలకు వెళ్లే ముందు మీ హామీలు గురించి చెప్పండి.. మీరు ఇచ్చిన హామీలు అమలు అయ్యేదాకా..BJYM పోరాటం చేస్తుందన్నారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో, హైద్రాబాద్ లో గన్ పార్క్ దగ్గర నిరసన చేస్తాం.. దసరా తర్వాత..అర్థ నగ్న ప్రదర్శన, బిక్షాటన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top