ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 17:
________________________________
యూత్ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద బీజేవైఎం భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీజేవైఎం నేతలు,కార్యకర్తలు హాజరైన్నారు.ఈ సందర్బంగా గణేష్ కుండెమాట్లాడుతూ రాహుల్ గాంధీ పప్పు గాంధీ ఆయన హైద్రాబాద్ వస్తె యువత చెప్పుల దండ వేస్తారన్నారు.
రాహుల్ గాంధీ దిల్లీలో ధర్నాలు కాదు ఇక్కడికి వచ్చి మాట్లాడు..తెలంగాణ లో ఉన్న మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించు…ద్వంద వైఖరి చేయకండి ..
ఎంఎల్సీ ఎన్నికలకు వెళ్లే ముందు మీ హామీలు గురించి చెప్పండి..మీరు ఇచ్చిన హామీలు అమలు అయ్యేదాకా.. బీ జే వై ఎం పోరాటం చేస్తుందని హెచ్చరించారు.4000 వేల నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలి .జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి .గణేష్ కుండె డిమాండ్ చేశారు.లేకపోతే యువత మిమ్మల్ని తరిమి కొడుతుందని హెచ్చరించారు.హామీలు అమలు చేయకుండా ఎమ్మెల్సీ ఓట్లు ఎలా అడుగుతారని గణేష్ కుండె ప్రశ్నించారు.














