ఈతరం భారతం ఖమ్మం రూరల్ / పల్లెగూడెం:రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్,
మధుశ్రీ నలుబోల.
వికాస వేదిక ఆధ్వర్యంలో కవి సమ్మేళనంలో పల్లెగూడెం గ్రామంలోని ఇండో బ్రిటిష్ స్కూల్ ఆవరణలో “ప్రజాస్వామ్యమా… వర్ధిల్లు!” అనే కీలక అంశంపై కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా బుక్కా సత్యనారాయణ వ్యవహరించి, కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్ట్ ఎన్. తిరుమల్ అగ్రరాజ్యాల దోపిడీని ఎండగట్టారు అయన మాట్లాడుతూ… వర్తమాన ప్రజాస్వామ్యంలో జరుగుతున్న లోతుపాట్లలను వివరించారు. ప్రపంచ స్థాయిలో అగ్రరాజ్యాలు భారతదేశంపై, భారతీయులపై సాగిస్తున్న ఆధిపత్యం, దోపిడీ విధానాలను ఆయన తీవ్రంగా ఎండగట్టారు. దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, సమాజంపై వాటి ప్రభావం గురించి సభలో లోతుగా విశ్లేషించారు.వికాస వేదిక గౌరవ సలహాదారు, ఆర్కిటెక్ట్ తోటపల్లి సృజన్ కుమార్ మాట్లాడుతూ… మణిపూర్ ఘటనలపై గళమెత్తారు మణిపూర్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అమానుష ఘటనలు, ఆకృత్యాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో మహిళలకు రక్షణ కల్పించడంలో జరుగుతున్న లోపాలను ప్రస్తావిస్తూ, సామాజిక సమన్యాయం కోసం గళమెత్తాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
లెనిన్ శ్రీనివాస్
వికాస వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేనిన్ శ్రీనివాస్ మాట్లాడుతూ… సాహిత్యంతోనే చైతన్యం అని దేశంలో జరుగుతున్న రాజకీయ, సామాజిక పరిణామాలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాస్వామ్య మూలాలను కాపాడుకోవడానికి, ప్రజల్లో చైతన్యం నింపడానికి సాహిత్యం, కవిత్వం శక్తివంతమైన సాధనాలుగా పనిచేస్తాయని చెప్పారు.ఈ కవి సమ్మేళనంలోతిరునగరి శ్రీనివాస్, ఎడవల్లి శైలజ, చిన్న హుస్సేన్, మోయుద్దిన్, నలుబోల మధుశ్రీ, గుడిసె రాజశేఖర్, రాజేందర్ బాల కవులు పలువురు కవులు, రచయితలు, ప్రముఖులు పాల్గొని తమ కవితల ద్వారా ప్రజాస్వామ్య విలువలను, సామాజిక సమస్యలను వినిపించారు.














