EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వైభవంగా ఆస్థాన కార్యక్రమం.. దసరా ఉత్సవాల్లో ఆధ్యాత్మిక శోభ

ఈతరం భారతం ఇంద్రకీలాద్రి ఆంధ్ర ప్రదేశ్ అక్టోబర్ 16:

__________________________________________

ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు మూలా నక్షత్రం సందర్భంగా ఆస్థాన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆది దంపతుల నగరోత్సవం అనంతరం మహా రాజగోపురం ఎదుట ఆస్థాన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది. మూలా నక్షత్రం పర్వదినం సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుండటంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి దివ్యదర్శనం, ఆలయ సంప్రదాయ కార్యక్రమాలతో దసరా ఉత్సవాల్లో భక్తి వైభవం వెల్లివిరిసింది.

Related News

Select the Topic
Scroll to Top