ఈతరం భారతం భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 14:
బోర్గంపహాడ్మండలం, ముసలిమడుగు గ్రామ పంచాయతీలోని ఎస్టీ కాలనీలో భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు గొగ్గిల నారాయణ అధ్యక్షతన నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మానవ హక్కుల అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ గ్రామ మాజీ సర్పంచ్ వెంకన్న మరియు సంస్థ జాతీయ చైర్మన్ అనంతుల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సంద్భంగా సంస్థ జాతీయ చైర్మన్ మాట్లాడుతూ ప్రతీకొకరికి మానవ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి అని ఆయన తెలిపారు.అందరికి సమానహక్కులు కల్పించడమే లక్ష్య మన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ అధికారుల సహకారంతో వారి హక్కుల కోసం ఈ సంస్థ పనిజేస్తుందన్నారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందించే దిశగా రాజ్యాంగబద్దంగా పనిచేస్తుందన్నారు. ముఖ్యంగా ప్రతీ గృహిణిచదువుకోవాలని ఇంట్లో గృహిణి చదువుకుంటే ఇంటిల్లిపాది విద్యావంతులుగా అవుతారని అంతేకాక నాగరికత తెలుస్తుందని తెలిపారు. అందుకనే ప్రతీ ఒక్కరు చదువుకోవాలని అప్పుడే వారు వారి హక్కులు సాధించడంలో సఫలం అవుతారని తెలిపారు.ఈ సందర్బంగా హ్యూమన్ రైట్స్ విమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్ అనంతుల శ్రీనివాస్ కు బూర్గం పహాడ్ మండలం ముసలి మడుగు గ్రామము హ్యూమన్ రైట్స్ సభ్యులకు అవగాహనా సదస్సుకు విచ్చేసిన వారికీ నేషనల్ సెక్రటరీ గూడెపు. మాధవి మరియు నేషనల్ సెక్రటరీ A. పద్మావతి శుభాభినందనలు తెలిపారు.















