EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

లక్ష్మారెడ్డి కాలనీ ముఖద్వారాన్ని ప్రారంభించిన కాలని వ్యవస్థాపకులు బొబ్బల లక్ష్మారెడ్డి

ఈతరం భారతం హైద్రాబాద్ (బోడుప్పల్)జూన్ 14:

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని బొల్లిగూడ లక్ష్మారెడ్డి కాలనీ లో రెండు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ముఖద్వారాన్ని లక్ష్మారెడ్డి కాలనీ వ్యవస్థాపకులు బొబ్బల లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి కాలనీ ముఖద్వారాన్ని లాంచనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి కాలనీ అధ్యక్షులు ఆముదాల మల్లారెడ్డి బోడుప్పల్ మాజీ డిప్యూటీ మేయర్ కిషోర్ గౌడ్, సూరజ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ రవిచంద్ర, బాలాజీ నగర్ కాలనీ అధ్యక్షులు సోమయ్య, సూరజ్ నగర్ కాలనీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య నేత,సూరజ్ నగర్ కాలనీ మాజీ అధ్యక్షులు బిఆర్ఏస్ నాయకులు రవికుమార్ ,స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పడతం లోకేష్, బిజెపి నాయకులు గండిపల్లి రాజు, లక్ష్మారెడ్డి కాలనీ ప్రధాన కార్యదర్శి ఎండి పాషా, కోశాధికారి మహేందర్, తదితరులు హాజరయ్యారు .

ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి కాలనీ వ్యవస్థాపకులు బొబ్బల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాలనీలో నివసించే ప్రజలు ఒక్కొక్కరు సహాయ సహకారాలు అందించుకుంటూ అన్నదమ్ముల వలె మెదులుతూ కాలనీ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు ఇప్పటివరకు ప్రక్క కాలనీలో లేనివిధంగా కాలనిలో అమ్మవారి మందిరం, కమిటీ హాల్ తో పాటు చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్టన కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు మునుముందు కూడా కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

Related News

Select the Topic
Scroll to Top