ఈతరం భారతం హైద్రాబాద్ (మేడిపల్లి) జూన్ 14
రాత్రి వేళల్లో దొంగలపట్ల కాలనీల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేడిపల్లి ఎస్ ఐ పి.శ్రీను హెచ్చరించారు.సూరజ్ నగర్ కాలనిలో సిసి కెమెరాల వైర్ కటింగ్ విషయం పై ఆదివారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ పి.శ్రీను కలిసి కాలనీ అసోసియేషన్ సభ్యులు.పిర్యాదు చేసారు.ఈ సందర్బంగా ఎస్ ఐ శ్రీను మాట్లాడుతూ ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అదేవిధంగా, కాలనీ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా సూరజ్ నగర్ కాలనీలో రెగ్యులర్ పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని కోరడం జరిగింది.
దీనిపై స్పందించిన ఎస్సై వెంటనే పెట్రోలింగ్ సిబ్బందికి ఫోన్ చేసి, ప్రతిరోజూ సూరజ్ నగర్ కాలనీలో పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.అలాగే, పెట్రోలింగ్ నిర్వహించినట్లు నమోదు చేయడానికి ఒక “పాయింట్ బుక్” ఏర్పాటు చేయాలని కాలనీ సభలకు సూచించారు.
ఇకపై పెట్రోలింగ్ సిబ్బంది కాలనీని సందర్శించిన ప్రతిసారి ఆ పాయింట్ బుక్‌లో సంతకం చేసి వెళ్తారన్నారు.కాలనీ భద్రతను మరింత మెరుగుపరచదానికి కాలనీ వాసులు పోలీసులకు సహకరించాలని కోరారు.ఎస్ ఐ ని కలిసిన వారిలో కాలనీ అసోసియేషన్ స్టీరింగ్ కమిటీ చెర్మెన్ లక్ష్మయ్య నేత, అధ్యక్షలు రవిచంద్ర.ప్రధాన కార్యదర్శి కపిల్,కోశాధికారి జగదీష్,సీనియర్ సభ్యులు వెంకటేశ్వరులు,రాంబాబు తదితరులు పాల్గొన్నారు















