EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పి డి ఎస్ యు రాష్ట్ర నూతన అధ్యక్ష ప్రధానకార్యదర్శులుగా కే.. పవన్ కుమార్,కే.ఎల్ గణేష్ ఎన్నిక

ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 7 :

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 5 .6 తేదీలలో హైదరాబాద్ కొత్తపేట లోని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు భవన్లో విజయవంతంగా జరిగాయి. ఈ జనరల్ కౌన్సిల్ లో 21 మందితో నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

రాష్ట్ర నూతన అధ్యక్షులు గా కే. పవన్ కుమార్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కే.ఎల్ .గణేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గా పి. సతీష్ (నిజాంబాద్) ఈ ధరణి (రంగారెడ్డి) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎం.బి. వంశి కుమార్ (హైదరాబాద్) బి .పృద్వి (నిజామాబాద్) రాష్ట్ర కోశాధికారిగా టి. అనిల్ (వనపర్తి) రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా. ఇ.విజయ్ కన్నా (హైదరాబాద్ సెంటర్) జి సైదులు (నల్గొండ) జి. ప్రవీణ్ (హైదరాబాద్) డి .ఉషశ్రీ (మహబూబాద్) ఎస్. మనిషా (సిరిసిల్ల) డి.యోచన (రంగారెడ్డి) సంగీత (హైదరాబాద్) విజయ్ (మహబూబ్నగర్) లతో పాటు మరో 6 కో- ఆప్షన్ తో కలిపి 21 మంది తో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది. ఈ సందర్బంగా జనరల్ కౌన్సిల్ ఈ క్రింది తీర్మానాలను ఆమోదించింది,1)రాష్ట్ర ప్రభుత్వం 27 వేల పాఠశాలలను 4000 లకు కుదించే ఆలోచనను ఉపసంహరించుకోవాలని, 2)ప్రైవేట్ ,కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని,3)పెండింగు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని,4) ఖాళీగా ఉన్న టీచర్ MEO,DEO , ఉపాధ్యాయ,లెక్చరర్స్ పోస్టుల ను వెంటనే భర్తీ చేయాలని,5) అద్దె భవనంలో నడుస్తున్న పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్ ,గురుకుల పాఠశాలలకు, కళాశాలలకు తక్షణమే సొంత భవనాలు నిర్మించాలని,

6) ప్రభుత్వ యూనివర్సిటీలకు 500 కోట్ల చొప్పున తక్షణమే కేటాయించాలని,ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని,7)రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, 8) ఇంటర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం పక్షణమే ప్రారంభించాలని తీర్మానించినట్లుPDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణPDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కే.ఎల్ గణేష్ తెలిపారు

Related News

Select the Topic
Scroll to Top