EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాహన, డెలివరీ సేవల నిరవధిక సమ్మె

ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 7

తెలంగాణలో రేపటి నుంచి ఆటో, క్యాబ్, లారీ, ఓలా, ఉబర్, ర్యాపిడోతో పాటు స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఇన్‌స్టామార్ట్ తదితర డెలివరీ సేవలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు వాహన, డెలివరీ సంఘాల జేఏసీ ప్రకటించింది. మొత్తం 16 వాహన సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయని, తమ సమస్యలపై పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ స్పష్టం చేసింది.యాప్ ఆధారిత రవాణా సేవలకు కనీస బేస్ ఫేర్, ప్రతి కిలోమీటర్‌, ప్రతి నిమిషానికి న్యాయమైన చార్జీలను నోటిఫై చేయాలని, తెలంగాణ గిగ్ & ప్లాట్‌ఫారం వర్కర్స్ రూల్స్ అమలు చేసి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని జేఏసీ ప్రధానంగా డిమాండ్ చేసింది.

Related News

Select the Topic
Scroll to Top