EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఫీజుల బకాయి – బీజేపీ లడాయి

ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 24 ;

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు ₹15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కారణంగా సుమారు 40 లక్షల మంది విద్యార్థుల విద్యాభవిష్యత్తుపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.

రామచందర్ రావు నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరాహార దీక్షలో బిజెపి మీడియా ప్యానలిస్ట్ డాక్టర్ ప్రభా గౌడ్ పాల్గొని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచందర్ రావు గారు, మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘునందన్ రావు గారు, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, శ్రీమతి డి.కే. అరుణ గారు, శ్రీ పాయల్ శంకర్ గారు, శ్రీ రాకేష్ రెడ్డి గారు, శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.

అలాగే బీజేపీ యువమోర్చా నాయకులు, మహిళా మోర్చా నాయకులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడకుండా, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related News

Select the Topic
Scroll to Top