ఈతరం భారతం యాదాద్రి భువనగిరి ఆగస్ట్ 24
:జిల్లా పరిధిలోని ఆలేరుకు చెందిన ఐత వైష్ణవి హైదరాబాద్ బడంగ్పేట్ లోని ఎంబిఎస్ఆర్ కళాశాలలో బీటెక్ ఐటీ తో పూర్తిచేసి కళాశాలలో ఓవరాల్ టాపర్ గా నిలిచింది. కళాశాల స్నాతకోత్సవంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం చేతుల మీదుగా మెడల్, పట్టాను అందుకుంది. వైష్ణవి తల్లిదండ్రులు నాగరాజు, నాగవాణి తో పాటు కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు, బంధుమిత్రులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.















