ఈతరం భారతం హైదరాబాద్, ఏప్రిల్ 19 :
పరిశోధన, అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రముఖ ఆహార, వ్యవసాయ వ్యాపార సంస్థ అయిన గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్ తన మూడో ఎడిషన్’ఉమెన్ ఇన్ అగ్రికల్చర్ సమ్మిట్’ వేదికగా ‘దిశ’ అనే మహిళా కెరీర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ను ప్రారంభించినట్లు గోద్రెజ్ అగ్రోవెట్ ఎండీ, సీఈఓ సునీల్ కటారియా ఆదివారం నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ సస్టైనబిలిటీ, సీఎస్ఆర్ హెడ్ పాక్జాన్ దస్తూర్, గోద్రెజ్ అగ్రోవెట్ సీహెచ్ఆర్ఓ మల్లిక ముత్రేజా లతో కలసి ఆయన మాట్లాడుతూ వన్ ఎం వన్ బి ఫౌండేషన్, ఇక్కా లెర్నింగ్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అమలు అవుతున్న ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వ్యాప్తంగా 276 మందికి పైగా మహిళా విద్యార్థినులు శిక్షణ పొందారని తెలిపారు. వీరిలో పలువురు ప్రముఖ సంస్థలలో ఉద్యోగాలు కూడా సాధించినట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలో లక్ష మంది మహిళలను ప్రోత్సహించాలనే పెద్ద లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ‘దిశ’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఈ సంస్థ నైపుణ్య శిక్షణ, స్కాలర్షిప్లు, కెరీర్ ప్రారంభ దశలో ఇచ్చే ప్రోత్సాహం, నాయకత్వ శిక్షణ వంటి వివిధ కార్యక్రమాల ద్వారా సుమారు 63.3 వేల మందికి పైగా మహిళలకు చేరువైనట్లు తెలిపారు.















